కరోనావైరస్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీని కారణంగా విద్యాసంస్థలు పూర్తిగా మూతబడ్డాయి.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యేయేతర సిబ్బందికి 2020వ సం||మార్చి, ఏప్రిల్, మరియు మే నెలలకు జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం జి.ఒలను విడుదల చేసింది.
కానీ, స్కూలు యాజమాన్యాలు జి.ఓలను లెక్కచేయడం లేదు. విద్యాశాఖాధికారులకు అనేకమార్లు విన్నవించుకొన్ననూ వారు స్పందించడం లేదు. జీతాలు లేక సిబ్బంది ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
కావున ప్రస్తుత మా ఆర్థిక పరిస్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేసే సిబ్బందికి రూ. 20,000/-లు ఆర్థిక సహాయాన్ని అందించి మా కుటుంబాలను ఆదుకొనవలసినదిగా కోరుచున్నాము.
విద్యాశాఖాధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై ఒత్తిడిచేసి మా జీతాలను యిప్పించుటకు తగు చర్యలు తీసుకొనవలసినదిగా కోరుచున్నాము.