నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండలం, సౌత్ ఆములూరు గ్రామ పంచాయతీలో పర్యటించి, సుమారు 2కోట్ల 37 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
సౌత్ ఆములూరు గ్రామంలో పర్యటించి, ప్రజలను అప్యాయంగా పలకరిస్తూ, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కాకాణి.
గ్రామాలలోని ప్రజలకు అవసరమైన సదుపాయాలను శాశ్వత ప్రాతిపదికన కల్పించాలనే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం.
ఏడాది కాలంలో నియోజకవర్గంలో 800 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
గతంలో ఈ ప్రాంతంలో మంత్రులుగా, శాసన మండలి సభ్యులుగా చేసిన వాళ్లు ఇక్కడి ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.
ప్రజలకు ఉపయోగ పడని నీరు- చెట్టు పథకం ద్వారా దోచుకున్నారు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు.
తెలుగుదేశం ప్రభుత్వంలాగా ప్రజలకు పనికిరాని పథకాలు పెట్టకుండా, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు.
టిడిపి ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ సైతం జన్మభూమి కమిటీలను కాదని అర్హులకు న్యాయం చేయలేని పరిస్థితి.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పేదరికమే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాము.
తెలుగుదేశం పార్టీ తీరు చాలా సిగ్గుచేటుగా ఉంది.
ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లును కూడా తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో అడ్డుకున్నారు.
వైయస్సార్సీపీ రంగులను చూసి చంద్రబాబు భయపడుతున్నాడు.
టి.పి.గూడూరు మండలానికి అవసరమైన నిధులను కేటాయించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం.