సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన మహోన్నత వ్యక్తి దివంగత మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని 34 డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం హజరత్ నాయుడు పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి డివిజన్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం హజరత్ నాయుడు మాట్లాడుతూ కోటంరెడ్డి బ్రదర్స్ ( గౌ. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గౌ. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు) సూచనల మేరకు డివిజన్ పరిధిలో జయంతి కార్యక్రమం నిర్వహించామన్నారు.
బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆ మహానేత ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని పేర్కొన్నారు.
రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ప్రజలకు గర్వకారణమని హజరత్ నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల శీనయ్య నాయుడు, పర్వతాల శ్రీనివాసులు గౌడ్, ఆనంద్ బాబు, జియాద్, నాని, అశోక్, దాసు, రాజీ మాల్యాద్రి, విజయ్ కుమార్, అబ్దుల్ గని, కీర్తనమ్మ, లక్ష్మి, రమీజ్, గోపి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.