నెల్లూరులోని కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ చక్రధర్ బాబుతో సమావేశమైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

0
478

నెల్లూరులోని కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ చక్రధర్ బాబుతో సమావేశమైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బొల్లినేని రామారావు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, తాళ్లపాక రమేష్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ, కావలి టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు

కావలి ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చిన వారితో పాటు సహకరించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్

విగ్రహ పునఃప్రతిష్టకు వెంటనే చర్యలు తీసుకోవాలని..లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం తప్పదని కలెక్టర్ కు తెలిపిన టీడీపీ నాయకులు

అనంతరం ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చిన ప్రదేశాన్ని, విగ్రహాన్ని పరిశీలించిన నాయకులు

సోమిరెడ్డి కామెంట్స్:

🔸ఈ నెల 18న కావలిలోని ముసునూరు వద్ద ఎవరికీ ఇబ్బంది లేని ప్రదేశంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు పట్టపగలు దుర్మార్గంగా తొలగించారు..

🔸ఆ విగ్రహాన్ని బావిలో వేసేందుకు ప్రయత్నించారు..అక్కడి పెద్దలు, అభిమానులు అడ్డుకుని ఒకరింటి వద్ద భద్రపరిచారు..

🔸 ఎన్టీఆర్ విగ్రహంతో అమ్మవారి ఆలయానికి ఎలాంటి అడ్డంకులు లేవు.అయినా నిర్వాహకులకు ఏవైనా అభ్యంతరాలుంటే చర్చించుకుని పక్కకు జరిపేందుకు కూడా ఎన్టీఆర్ అభిమానులు అంగీకరించారు..

🔸ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు బిడ్డ, తెలుగువారికి గుర్తింపుతెచ్చిన మహానుభావుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం తొలగింపు దుర్మార్గం..

🔸సాక్షాత్తు పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కావలిలో తొలగిస్తారా..

🔸ఓ వైపు దుర్మార్గంగా వ్యవహరించి మా నాయకుడి విగ్రహాన్ని తొలగించి మరోవైపు ఇంకో విగ్రహం పెడతామంటారా..

🔸అసలు మా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి, ఇంకో విగ్రహం పెట్టడానికి మీరెవరు..మీకెవరు అనుమతి ఇచ్చారు..ఇంత బరితెగింపా..

🔸ఈ రాష్ట్రంలో రోడ్లపై, కూడళ్లలో వందల వైఎస్సార్ విగ్రహాలు పెట్టారు..ఎక్కడైనా మా కార్యకర్తలు ఒక చిన్న మచ్చ తెచ్చారా..

🔸ఇంత రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదు..

🔸ఈ ఘటనపై కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం..ఆయన బాధ్యతలు చేపట్టిన తెల్లారే ఈ ఘటన చోటుచేసుకుంది..

🔸కలెక్టర్, ఎస్పీ చర్చించుకుని విగ్రహాన్ని తొలగించిన వారిపైనా, సహకరించిన అధికారులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలి..

🔸లేనిపక్షంలో రాష్ట్రంలోని ఎన్టీఆర్ కుటుంబ అభిమానులందరూ ఉద్యమిస్తారు..కోవిడ్ కారణంగానే ఒక అడుగు వెనక్కేశారు..

🔸చివరకు విగ్రహాన్ని 4 అడుగులు పక్కకు జరిపేందుకు కూడా అంగీకరించారు..

🔸ఈ ఘటన జరిగిన తర్వాత బాధ్యులను సీఎం జగన్మోహన్ రెడ్డి మందలించాల్సిందిపోయి..పట్టించుకోకపోవడం దురదృష్టకరం..

🔸ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తే అదే చట్టమా..

🔸మొన్నటి వరకు మీ ఎమ్మెల్యేలే జిల్లాలో కలెక్టర్, ఎస్పీలను నోటికొచ్చినట్టు మాట్లాడినా చర్యల్లేవు..చివరకు కలెక్టర్ నే బదిలీ చేశారు..

🔸కావలిలో ఎన్టీఆర్ విగ్రహ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి..లేదంటే మా కార్యచరణ మాకుంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here