యువత భవిష్యత్తు ను అంధకారం లోకి నెట్టివేసేలా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు – సోమిరెడ్డి

0
545

తెలుగుయువత నెల్లూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో తెలుగుయువత ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున అల్లీపురం లోని మాజీ మంత్రి వర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నివాసానికి చేరుకొని , ఆయనను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చం ను అందజేయడం జరిగింది. తెలుగుయువత జిల్లా కో ఆర్డినేటర్ గా తనను నియమించేందుకు సహకరించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కాకర్ల. తిరుమల నాయుడు కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులు పొందడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ……

👉 యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి కొట్టేలా , యువత భవిష్యత్తు ను అంధకారం లోకి నెట్టివేసేలా నేటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి.

👉 వైసీపీ అవలంభిస్తున్న తీరు తో మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు తద్వారా దక్కాల్సిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల వశం అవుతున్నాయి.

👉 తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షిస్తూ గుజరాత్ ను సైతం వెనక్కి నెట్టి, దేశం లోనే పెట్టుబడులకు అనువైన ప్రథమ రాష్ట్రం గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్ నేటి వైసీపీ పాలన లో పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించ లేక, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేక చతికిలబడుతోంది.

👉 గత తెదేపా ప్రభుత్వ హయాంలో 4 లక్షలకు పైగా నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా అందిస్తున్న రూ.2000 ల నిరుద్యోగ భృతి ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి యువత ను నిర్లక్ష్యం చేస్తోంది .

👉 ప్రతీ ఏడాది జనవరి నెలలో ఉద్యోగాల కాలెండర్ ను ప్రకటిస్తామని, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువత ను నమ్మించి వారి సాయం తో అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు ఆ ఊసే మరిచింది.

👉 కూల్చివేతలు, విగ్రహాల విధ్వంసాల కే వైసీపీ పాలన పరిమితం అయింది. ఏడాది వైసీపీ పాలన లో రాష్ట్ర అభివృద్ది పదేళ్లు వెనక్కి వెళ్ళింది.

👉 ఎస్సీ, ఎస్టీ,బీసీ కార్పొరేషన్ ల నిధుల మళ్లింపు తో సబ్సిడీ రుణాల పై ఆధార పడి , స్వల్ప పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు పొందుతున్న యువత పరిస్థితి నేటి వైసీపీ పాలన లో అగమ్యగోచరం గా మారింది.

👉 యువత భవిష్యత్తు ను అంధకారం లోకి నెడుతూ , రాష్ట్ర అభివృద్ది ని అగాథం లోకి పడవేస్తూ వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశ విధ్వంస పాలన కు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమయింది .

👉 రాష్ట్ర అభివృద్ది,భవిష్యత్తు యువత భుజస్కందాల పై ఉంది. యువత ఉద్యమాల తోనే మార్పు సాధ్యం అవుతుంది .

👉అభివృద్ది ప్రదాత, ఉద్యోగాల సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా చేసేంత వరకు యువత విశ్రమించ వద్దు.

పై ఈ కార్యక్రమం లో….. తెలుగుయువత నాయకులు గురు ప్రసాద్, మోపూరు. సాయి కిరణ్, వాసిరెడ్డిచంద్ర నాగ్ , శశి , సత్యం రెడ్డి, వినోద్ , రసూల్, గౌతమ్ చౌదరి , శ్రీనివాస్, షేక్ అస్లాం, వసీం , షాహుల్, వెంకటేష్ , అఖిల్, ప్రమోద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here